- భూవివాదంలో విసిగివేసారిన రిటైర్డ్ వీఆర్వో బసిరెడ్డి
- అక్రమార్కులకు రెవెన్యూ అండదండలు
- పీజీఆర్ఎస్ తోపాటు మంత్రి లోకేష్ కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినా దక్కని న్యాయం
- ప్రత్యర్థులు ముందుకొస్తే పంచాయితీ చేస్తామని ఎండార్స్మెంట్ ఇస్తున్న అధికారులు
- మీరు రాండిరా స్వామీ అని మేమెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకోవాల్నా అంటున్న బసిరెడ్డి కుటుంబీకులు
- అధికారపార్టీ వాళ్లమైనా అడుగడుగునా అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన

“ఎల్లో బ్లడ్” అనేది టీడీపీ కార్యకర్తల కరడుగట్టిన అభిమానానికి పరాకాష్టగా వాడే ఉపమానం అయితే “పచ్చబిళ్ల” అనేది ఆ పార్టీ అధిష్టానం కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యతకు ఉపమానం. 2024లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి “ఎల్లో బ్లడ్” ఎంతకైనా తెగించింది. కానీ అధికారంలోకి వచ్చాక “పచ్చబిళ్ల” ప్రాధాన్యత తగ్గింది. చాలాచోట్ల ఆ పార్టీ కార్యకర్తలు మెజారిటీ సంఖ్యలో అధికారులు తమను దేకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ పనులు కాకపోవడం దేవుడికెరుకగానీ తామే ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాకు చెందిన ఒక టీడీపీ కుటుంబం తమ భూముల విసయంలో పడుతున్న మనోవేదన ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
“వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీటీసీ ఆన్లైన్లో మా భూమి తగ్గించాడు, మా పొలాలకు వెళ్లే దారి మూసేశాడు, వాగును ఆక్రమించాడు. రెవెన్యూ అధికారులు ఆయన ఎట్ట చెబితే అట్ట వింటున్నారు. ఎంతగా అంటే సర్వేయర్ అతనికి లబ్ధి చేకూర్చడానికి నా సంతకం ఫోర్జరీ చేసేశాడు” అంటూ కడప జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఒక రిటైర్డ్ వీఆర్వో ఆవేదన చెందుతున్నాడు. చక్రాయపేట మండలం మహదేవపల్లెకు చెందిన ఆయన ఈ అన్యాయాలపై పీజీఆర్ఎస్ లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ఫలితం లేకపోవడంతో మంత్రి లోకేష్ కు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్డీఓ ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ ఒక ఎండార్స్మెంట్ ఇచ్చాడు. సారాంశం ఏంటంటే… కబ్జాదారుడు సంబంధిత రికార్డులు తీసుకొని వాళ్లవద్దకు వస్తే పంచాయితీ చేసి రోడ్డుకడ్డంగా పెట్టిన గేటు తీసేయిస్తారంట. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన మళ్లీ అన్ని భూ సమస్యలనూ ఏకరువు పెడుతూ ఈ నెల తొమ్మిదో తేదీన కలెక్టరుకు ఫిర్యాదు చేశాడు. తన భూమి హక్కులను పునరుద్ధరించడమే కాకుండా వాగు పొరంబోకు భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని గ్రామ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, ఫోర్జరీ చేసినందుకు సర్వేయర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
విచారించదగ్గ విషయం ఏమంటే ఒకప్పుడు మన డిపార్ట్మెంట్ వాడే కదా అని రెవెన్యూ అధికారులు అనుకోలేదు. మన పార్టీ వాళ్లను మరోపార్టీ వాళ్లు ఇబ్బంది పెడుతున్నారని అధికారపార్టీ నాయకులూ అనుకోలేదు.
_ కుర్రా సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్
ఏదోకరోజు పచ్చబిళ్ల పని చేయదా!

మా బంధుమిత్రుల్లో వైఎస్సార్సీపీ వాళ్లు కూడా ఉన్నారు. నా అగచాట్లు చూసి మీ పచ్చబిళ్ల పని చెయ్యడం లేదా? అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏదోకరోజు పని చేస్తుందిలే అని నవ్వుతూ అంటానుగానీ ఆ తర్వాత చాలా బాధేస్తోంది. పోయిన ఐదేళ్లూ వాళ్ల ప్రభుత్వం ఉండటం వల్ల నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినా వాళ్ల మాటే చెల్లుతోంది. తిరిగి తిరిగి కాళ్ల తిప్పట తప్ప న్యాయం జరగడం లేదు.
_ బసిరెడ్డి, రిటైర్డ్ వీఆర్వో
లోకేష్, నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం

నేను ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కాలేజీలో చదివాను. ఇప్పుడు విద్యాశాఖా మంత్రి లోకేష్ కూడా అక్కడే చదివేవాడు. ఆ విషయం తెలిసినవాళ్లు లోకేష్ ను కలిసి కంప్లయింట్ చేయకూడదా అంటూ ఉంటారు. మేమేమీ ఫ్రెండ్స్ కాదు కదా.. ఆయనకు నేనెక్కడ గుర్తుంటాను.
_ అశోక్ కుమార్ రెడ్డి, బసిరెడ్డి కుమారుడు
అధికారులు మరీ బరి తెగించిపోయారబ్బా..!

బసిరెడ్డి మామ మమ్మల్ని సంప్రదించే ఫిర్యాదు చేస్తుంటాడు. వచ్చీరాగానే కేసు వేసేద్దామంటాడు. కానీ కోర్టులో కేసులు తెగేదెప్పుడు?, పైగా ఆయన టీడీపీవాడే… ఏదోక ఫిర్యాదు గట్టిగా తగులుకోక పోతాదా అనే ఆలోచనతో ఫిర్యాదులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. అధికారులకు ఇవతలోళ్లది న్యాయమని తెలుసు, పైగా ఫిర్యాదుదారుడు తమవాడేననీ(మాజీ) తెలుసు. అవతలోళ్లది తప్పని, రికార్డులను మేనిప్లేట్ చేస్తున్నారనీ తెలుసు. తప్పులు చేస్తూ కూడా దౌర్జన్యంగా దారికడ్డంగా గేటు పెట్టారనీ తెలుసు. అన్నీ తెలిసినా ఏమాత్రం కనికరం లేకుండా ఆ పక్కనే సపోర్టు చేస్తున్నారు. అధికారులు మరీ బరి తెగించిపోయారబ్బా..!
_ కానాల ఖగేశ్వర్ రెడ్డి, న్యాయవాది, రాయచోటి.
బసిరెడ్డి ఇటీవల కలెక్టరుకు చేసిన ఫిర్యాదును యధాతథంగా కింద ఇస్తున్నాం.
అయ్యా,
మొదటి సమస్య

నాకు మహదేవపల్లి గ్రామములో మా తండ్రి గారైన తాటిగొట్ల నరసింహారెడ్డి గారి నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమి ఉన్నది. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వము వారు రీ-సర్వే చేసిన తరువాత జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకములో ఈ క్రింది తప్పులు దొర్లినవి. వరుస సంఖ్య 8 భూభాగపు సంఖ్య 744 పూర్వపు సర్వే నెంబరు సబ్ డివిజన్ 386 లో విస్తీర్ణము య.10.31 సెంట్లలో నాకు య.5.15 సెట్లు నాకు వారసత్వముగా సంక్రమించినది. అయితే పూర్వపు సర్వే నెంబరు 386 లో య.4.39 సెంట్లు మాత్రమే నాకు సంక్రమించినది అని పాసు పుస్తకము నందు పొందపరచబడినది.
సర్వే నెం.393/2 లో నాకు 0.08 సెంట్లు భూమి ఉన్నది. ఈ భూమి వివరాలు పాసు పుస్తకములో పొందు పరచబడలేదు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నది.
మా తండ్రి గారైన నరసింహా రెడ్డి గారి నుండి సంక్రమించిన వ్యవసాయ భూమి నుంచి నా కుమారుడైన అశోక్ కుమార్ రెడ్డికి నేను ఇచ్చిన వ్యవసాయ భూమి సంబంధించి ఈ మధ్య ప్రభుత్వము వారు రీ-సర్వే తరువాత నా కుమారునికి ఇచ్చిన పాసు పుస్తకములో ఈ క్రింది తప్పులు దొర్లినవి.
వరుస సంఖ్య 8 లో భూబాగపు సంఖ్య 680 నందు పూర్వపు సర్వే నెంబరు, సబ్ డివిజన్ నె. 482/3 లో నేను నా కుమారునికి 1.08 సెంట్లు పైకి 0.54 సెంట్లు భూమి నా నుంచి సంక్రమించినది. అయితే కొత్త పాసు పుస్తకము నందు కేవలం 0.46 సెంట్లు మాత్రమే పొందు పరచబడి యున్నది. దీనినే ఆన్-లైన్ నందు నమోదు చేసారు. ఈవిధంగా నాకు తీవ్ర అన్యాయం చేసినారు.
30.376/25 0.18 2, 393/1 55 0.24 సెంట్లు మరియు నా కుమారుడు తాటిగుట్ల అశోక్ కుమార్ పేరిట సర్వే నెం.482/3 లో 0.54 సెంట్లు, సర్వే నెం.370 లో 1.02 సెంట్లు వ్యవసాయ భూములకు సంబంధించి పై సర్వే నెంబర్లను కొలచి సబ్ డివిజన్ చేసే విషయములో మా గ్రామ సర్వేయరు సురేష్ నా అనుమతి లేకుండా నా సంతకమును ఫోర్జరీ చేసి మా దాయది అయిన తాటిగుట్ల శివప్రసాద్ రెడ్డి s/o రామాంజనేయ రెడ్డి కి అక్రమముగా లబ్ది చేకూర్చలనే ఉద్దేశ్యముతో పై సర్వే నెంబర్లు కొలచి అందులో 482/3 నాకు సంక్రమించిన 0.54 సెంట్లుకు బదులుగా 0.46 మాత్రమే పొందు పరచి అన్-లైన్ నందు నమోదు చేసారు.
కావున దొర వారు మా గ్రామ సర్వేయరు సురేష్ పై కఠినమైన చర్యలు తీసుకొని సర్వే నెం.482/3 లో 0.54 సెంట్ల భూమిని నా పేరుమీద రీ- సర్వే అనంతరం తయారుచేసిన రికార్డుల యందు పొందుపరచ వలెనని ప్రార్ధించుచున్నాను.
మా గ్రామ పొలం సర్వే నెం.392 లో 1.42 సెంట్లు భూమి వాగు పొరంబోకుకు చెందినది. అయితే ఈ భూమిని మా గ్రామమమునకు చెందిన తాటిగుట్ల శివా రెడ్డి s/o రామాజినేయ రెడ్డి రెవన్యూ అధికారుల సహాయంతో రెవిన్యూ రికారుడ్ల ఉ తారుమారు చేఐ అక్రమించుకొని అతని స్వాధీనములో ఉంచుకొని మామిడి, చీనీ పంటలను సాగుచేసుకుంతున్నాడు. వాగు పొరబోకు భూమి శివప్రసాద్ రెడ్డి ఆక్రమించుకోవడం వలన వర్షాలు పడిన సమయంలో వర్షపు నీరు వ్యవసాయ భూములలోనికి ప్రవేశించి నేల కోతకు గురౌతున్నది. వాగు పొరంబోకు శివప్రసాద్ రెడ్డి ఆక్రమణలో ఉండడంతో ఆ భూమిలో గుండా రైతులు తమ పొలాలలోకి పోకుండా రైతులను అడ్డగించి వారికి తీవ్రమైన అసౌకర్యానికి గురి చేయుచున్నారు.
కావున గౌరవ కలెక్టర్ వారికి మనవి చేయడం ఏమనగా, మహదేవపల్లి గ్రామ రైతులపై దయవుంచి తాటిగుట్ల శివప్రసాద్ రెడ్డి అక్రమణలో ఉన్న వాగు పొరబోకు భూమిని ప్రభుత్వ ఆధీనము చేసుకొని గ్రామ ప్రజల ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడేలా చేయుమని కడప జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించి సహాయ పడవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
నమస్కారములతో,
రెండవ సమస్య :-
3.374/1, 376/22, 393/1, 396/3 లో తాటిగుట్ల శివారెడ్డి మరియు తాటిగుట్ల బసిరెడ్డికి పోను మిగిలిన భూమిని రస్తాకు బావి, బారి గడ్డలు కలసి 1.69 సెంట్లు నా పెద్దలు రాశిన జాయింట్‌గా పెట్టియున్నారు. సదరు భూమిని తాటిగుట్ల శివప్రసాద్ రెడ్డి పేరు మీద నయోదు చేయించుకొని ఆ తరువాత తన భార్యయైన తాటిగుట్ల శైలజ, కుమారుడైన కిరణ్ కుమార్ రెడ్డి పేర్ల మీద అక్రమముగా ఆన్-లైన్లో ఎక్కించుకొని పాసు బుక్కు పొంది యున్నాడు. ప్రస్తుతము ఆ భూమికి ఇరువైపులా ఇనుప గేట్లు బిగించి నన్ను పోనీయకుండా చేస్తున్నారు. ప్రస్తుతము ఉన్న ఇనుప గేట్లను తొలగించమని నేను రెవిన్యూ అధికారులకు విన్నవించుకున్నా రెవిన్యూ అధికారులు స్పందించలేదు. ఈ రస్తా విషయమై పలుమార్లు కలెక్టర్ గారికి అర్జీ మూలకముగా విన్నవించుకొని యున్నాము. టి. శివప్రసాద్ రెడ్డి కి 3 నోటీసులు ఇచ్చినా డాక్యుమెంట్లు సమర్పించకుండా కొంత సమయం కావలెనని కోరియున్నాడు. డాక్యుమెంట్లు సమర్పించుటకు నిరాకరించినా కూడా అతని మీద చర్య తీసుకొనకుండా కాలక్షేపణ చేయుచున్నారు. సర్వే నెం. 393/2లో బావి యున్నది. సదరు బావి బారి గడ్డలు కలసి 0.80 సెంట్లు విస్తీర్ణమును భార్య శైలజ పేరు మీద కుమారుడు కిరణ్ కుమార్ మీద ఆన్-లైనన్ను నమోదు చేయించి పాసు బుక్కును పొందియున్నారు.
కావున పై కనబరచని విషయములను సత్వరమే పరిష్కరించి నాకు న్యాయము చేయుదురని మీకు విన్నవించు కుంటున్నాను.












Leave a Reply