నిరంతర చైతన్య రథం
కోడి అన్నాక కూయక మానదు.. అది ‘తొలికోడి’ అన్నాక నిద్రపోతున్న సమాజాన్ని తట్టిలేపకుండా ఉండదు. తొలికోడి కూత అంటే కేవలం సూర్యోదయానికి సంకేతం కాదు, అది అన్యాయంపై ఎక్కుపెట్టిన అస్త్రం. రేపటి నుంచి మా తొలికోడి కూయబోతోంది.. ఆ కూత వినగానే ఎంతమంది కళ్లు తెరుస్తారన్నది పక్కన పెడితే, మేము మాత్రం నిజం కోసం నిలబడి తీరుతామనే తెగింపు మా తత్త్వం!
అక్రమార్కుల గుండెల్లో గుబులు
రాజకీయ ముసుగులో రాక్షసత్వం చేసే వారికైనా, కబ్జాలతో చెలరేగిపోయే శక్తులకైనా తొలికోడి కూత ఒక పీడకల కాబోతోంది. అరాచకాలు చేసే వారి తోలు వలిచేలా, భూకబ్జాలకు పాల్పడే వారి కోరలు పీకేలా మా వార్తా శంఖారావం ఉంటుంది. సామాన్యుడి కన్నీళ్లకు కారణమైన ఏ అక్రమార్కుడైనా సరే, తొలికోడి సంధించే పదునైన అక్షరాల ముందు తలవంచక తప్పదు. నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా మేము చేసే విశ్లేషణలు అక్రమార్కుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటాయి.
పేదవాడి రెక్కల నీడలో..
తొలికోడి అంటే కేవలం భయం కాదు, అది సామాన్యుడికి లభించే కొండంత అభయం. పేదవాడి కష్టాన్ని గుర్తించి, వారి జీవన ప్రమాణాలను పెంచే దిశగా మా వంతు కృషి చేస్తాం. సామాన్యుడిని తన రెక్కల చాటున చేర్చుకుని, అతనికి ఎదురయ్యే సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తుంది. ప్రతి పేదవాడి గొంతుకను ప్రభుత్వం దాకా చేర్చే వారధిలా ఈ ఛానల్ నిలబడుతుంది.
నిరంతర చైతన్య రథం
ఉదయాన్నే వినబడే కోడి కూత రోజంతా మారుమోగినట్లు.. తొలికోడి అందించే బ్రేకింగ్ న్యూస్, స్పెషల్ స్టోరీస్ నిరంతరం సమాజంలో చైతన్యాన్ని నింపుతాయి. ఇది కేవలం వార్తా ఛానల్ కాదు, ఇది నిజమైన జర్నలిస్టుల స్వేచ్ఛా వేదిక. అమ్ముడుపోని జర్నలిజంతో, అబద్ధం ముసుగు తొలగించి, నిజం రూపాన్ని నిటారుగా నిలబెట్టడమే మా ధైర్యం. రేపటి నుంచి మా కోడి కూస్తుంది.. అన్యాయం అంతం అయ్యేదాకా, సామాన్యుడికి న్యాయం జరిగేదాకా ఆ కూత ఆగదు!














Leave a Reply