గోమయం.. Goes to Colours

– కుర్రా సురేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్

ఆవు పేడతో గోడలకు రంగులు

గ్రామాల్లో జీవనోపాధికి కొత్త మార్గం

గోవులకు పెరగనున్న గిరాకీ

ఒకప్పుడు వ్యర్థంగా భావించిన గోమయం… ఇప్పుడు గోడలపై రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తోంది. పల్లెల్లో పడేసే ఈ పదార్థం ఇప్పుడు ఆదాయానికి మార్గంగా మారడం విశేషం. దేశవ్యాప్తంగా Khadi and Village Industries Commission ఆధ్వర్యంలో గోమయం ఆధారంగా తయారయ్యే పెయింట్ కొత్త మార్గాన్ని చూపుతోంది. పర్యావరణానికి హాని చేయని ఈ ప్రయత్నం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా సాగుతోంది. 2021లో నితిన్ గఢ్కరీ దీన్ని అధికారికంగా లాంచ్ చేశారు. ఇది భారతదేశంలో మొదటి కౌ డంగ్ (గోమయం) ఆధారిత పెయింట్. కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్‌స్టిట్యూట్ (జైపూర్)లో దీన్ని డెవలప్ చేశారు.

అలకడం నుంచి కెలకడం వరకు

గోమయాన్ని సేకరించి శుద్ధి చేసి, ద్రవరూపంలోకి మార్చి అందులో సహజ పదార్థాలను కలిపి ప్రత్యేక విధానంలో ప్రాసెస్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని శుద్ధి చేసి, నాణ్యత పరీక్షల తర్వాత వినియోగానికి సిద్ధం చేస్తారు. ఈ విధంగా తయారయ్యే పెయింట్ గోడలపై బాగా అంటిపడటంతో పాటు ఆరోగ్యానికి హానికరం కాని లక్షణాలు కలిగి ఉంటుంది.

బర్రె పేడ పనికిరాదు

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి పేడను ఉపయోగించలేరు. గోమయంలో సహజంగా ఉండే బైండింగ్ లక్షణాలు దీనికి ప్రధాన బలం. అదే సమయంలో బర్రె పేడలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో, అది గోడలపై సరిగ్గా నిలవదు. అందువల్ల ఈ రంగంలో గోమయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

పల్లెల్లో పెయింట్ తయారీ యూనిట్లు

ఈ పెయింట్ మార్కెట్‌లోకి నెమ్మదిగా ప్రవేశిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న యూనిట్లు ఏర్పడి స్థానికంగానే తయారీ జరుగుతోంది. ప్రభుత్వ నిర్మాణాల్లో కూడా దీనిని వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో లభించడం కూడా దీనికి ఒక ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో చిన్న స్థాయి తయారీ యూనిట్లు ప్రారంభించే అవకాశం ఉండటం వల్ల పల్లెల్లోనే ఉపాధిని సృష్టించే దిశగా ఇది ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పథకాల ద్వారా కొంతమేర సహాయం లభించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మార్కెట్‌లో నమ్మకం పెరగాలి. నాణ్యతలో మరింత మెరుగులు రావాలి. వెంటనే పెద్ద లాభాలు వస్తాయని ఆశించకుండా దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించేవాళ్లు ఈ వ్యాపారంపై దృష్టి పెట్టొచ్చు.

బిజినెస్ చేయాలనుకుంటున్నారా?

KNHPI, జైపూర్ గోమయం పెయింట్ ట్రైనింగ్ ఇప్పటికీ ఇస్తోంది. 5 రోజుల కోర్సు, ఫీజు ₹5,950 (GST సహా, నాన్-రీఫండబుల్), కొత్త బ్యాచులు కొనసాగుతున్నాయి.

చిరునామా: Ramshinghpura, Sikarpura Road, Sanganer, Jaipur – 303902. ఫోన్: 0141-2947819 / 2730369. ఈమెయిల్: knhpijaipur@gmail.com. వెబ్‌సైట్: www.knhpi.org.in.KVIC

ఆంధ్రప్రదేశ్ ఆఫీసులు

State Office, Vijayawada, ఫోన్ నెంబర్ 0866-2971725. ఈమెయిల్: sohyderabad.kvic@gov.in

Divisional Office, Visakhapatnam. ఫోన్ : 0891-2565904 / 2561156, ఈమెయిల్: kvicvizag@gmail.com. ఇవి అధికారిక నెంబర్లు, PMEGP స్కీమ్ కింద సబ్సిడీ, ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం వీళ్లను సంప్రదించాలి.

Prakritik Paint Manufacturers Association (PPMA) అధికారిక వెబ్‌సైట్ prakritikpaint.org ఉంది. ఇది KVICతో కలిసి పని చేస్తుంది. నాణ్యత స్టాండర్డ్స్, డీలర్‌షిప్, మాన్యుఫాక్చరర్ల లిస్ట్ ఇక్కడ ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి (Shri Ramdoot Paint Industries) వంటి అధికారిక మాన్యుఫాక్చరర్లు ఉన్నారు. మీరు సెటప్ చేస్తే లిస్ట్‌లో చేరవచ్చు.

సీరియస్ గా తీసుకుంటే మాత్రం

ముందు KNHPI Jaipur కి ట్రైనింగ్ కోసం అప్లై చేయండి (ఫీజు డిపాజిట్ చేసి ఈమెయిల్ పంపండి). ఆ తర్వాత Vijayawada KVIC ఆఫీసు (0866-2971725) సంప్రదించి PMEGP అప్లికేషన్ ప్రాసెస్ చేయండి. ప్రైవేట్ కన్సల్టెంట్స్ పై ఆధారపడొద్దు. అధికారిక మార్గం (KVIC/KNHPI) ద్వారా మాత్రమే టెక్నాలజీ తీసుకోండి. ఇదంతా అప్డేట్ సమాచారమే… అయినప్పటికీ మీరు ఫోన్ చేసి నేరుగా కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది.ఈ ప్రాజెక్ట్ నిజంగా మంచి అవకాశం. ఆలోచించి ముందుకెళ్లడం కాదు.. ముందుకెళ్లడానికి ఆలోచించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *