44 ఏళ్ల నిస్వార్థ నిబద్ధత.. దివ్యాంగుల ఆశాదీపం ‘గోనుగుంట్ల కోటేశ్వరరావు’

  • గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ‘గోనుగుంట్ల కోటేశ్వరరావు’ అవకాశం కల్పించాలి
  • 44 ఏళ్ల నిస్వార్థ సేవలకు, దివ్యాంగ సమాజానికి గౌరవం ఇచ్చినట్లే

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా పసుపు జెండాను గుండెల్లో మోస్తూ, సొంత కుటుంబం కంటే ప్రజాసేవకే ప్రాణమిచ్చిన అరుదైన నిస్వార్థ నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు. కేవలం రాజకీయం మాత్రమే కాదు.. సమాజంలో వెనుకబడిన, విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) జీవితాల్లో వెలుగులు నింపడమే శ్వాసగా బతుకుతున్న మానవతావాది. ఈ నెలలో భర్తీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో అన్ని విధాలా అర్హత కలిగిన గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి అవకాశం కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు, పారా క్రీడాకారులు, టీడీపీ శ్రేణులు హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నారు.

ఈ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో… ఆయనొక అరుదైన ఆదర్శం:
నాలుగు దశాబ్దాల విధేయత: టీడీపీ ఆవిర్భావం (44 సంవత్సరాలు) నుంచి నేటివరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ఆపదలోనూ, అధికారంలోనూ జెండా వీడని అచంచల విశ్వాసం ఆయన సొంతం.

దివ్యాంగుల హక్కుల పోరాట యోధుడు: గతంలో మాజీ విభిన్న ప్రతిభావంతుల సహకార సంస్థ చైర్మన్‌గా పనిచేస్తూ, దివ్యాంగ సమాజానికి అండగా నిలిచారు.

పారా స్పోర్ట్స్ పితామహుడు: రాష్ట్ర పారా స్పోర్ట్స్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, వెయ్యికి పైగా దివ్యాంగులను క్రీడల వైపు నడిపించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

పతకాల పంట.. ప్రభుత్వ ఉద్యోగాలు: ఆయన ప్రోత్సాహంతో వందలాది మంది దివ్యాంగ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడమే కాకుండా, సుమారు 25 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభించేలా భరోసా కల్పించారు

ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వాలి? ఇది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే పదవి కాదు!
రాజకీయ సేవ, సామాజిక సేవ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడల అభివృద్ధి—ఈ నాలుగు రంగాల్లో నిరుపమానమైన సేవలు అందించిన గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి సంపూర్ణ అర్హులు. ఆయనకు ఈ అవకాశం కల్పించడం అంటే ఒక వ్యక్తిని గౌరవించడం మాత్రమే కాదు; నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం చెందించిన ప్రతి నిస్వార్థ కార్యకర్తకు గుర్తింపునివ్వడమే. సమాజంలో ఎటువంటి గొంతుక లేని లక్షలాది మంది దివ్యాంగులకు చట్టసభల్లో ఒక బలమైన ప్రతినిధిని అందించడమే అవుతుంది.

అందుకే.. పార్టీ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత, గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు గోనుగుంట్ల కోటేశ్వరరావు గారి 44 ఏళ్ల నిస్వార్థ సేవలను, దివ్యాంగ సమాజం పట్ల ఆయనకున్న అంకితభావాన్ని గుర్తించి, ఈ నెలలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి చట్టసభలకు పంపాలని రాష్ట్ర ప్రజలు, లక్షలాది మంది దివ్యాంగులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *