పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సామాన్య మహిళ సంచలనం సృష్టించారు. గతంలో ఇళ్ళలో పనిమనిషిగా జీవనం సాగించిన కలితా మాఝీని ఆస్గ్రామ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ బరిలోకి దించగా, ఆమె అఖండ విజయం సాధించారు. ఎన్నికల్లో ఏకంగా 1,07,692 ఓట్లు సాధించిన ఆమె, తన సమీప ప్రత్యర్థి (AITC) పై 12,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రమైక జీవనం అంటే ఏమిటో తెలిసిన ఒక నిరుపేదరాలు నేడు చట్టసభకు ఎన్నికవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది కదా నిజమైన ప్రజాస్వామ్యం అంటూ రాజకీయ విశ్లేషకులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సామాన్యులకు సాధికారత కల్పించడంలో ఈ విజయం ఒక మైలురాయిగా నిలిచింది.
నాడు ఇళ్ళలో పనిమనిషి.. నేడు ఎమ్మెల్యే!












Leave a Reply