పశ్చిమ బెంగాల్‌లో కమల వికాసం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి 155 స్థానాల్లో ముందంజలో ఉండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ 107 స్థానాలకే పరిమితమై గట్టి ఎదురుదెబ్బ తింది. కాంగ్రెస్ 4, లెఫ్ట్ పార్టీలు 3 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ఫలితాలతో కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయం వద్ద పూర్తి నిశ్శబ్దం ఆవరించగా, ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది. చారిత్రాత్మక విజయం ఖాయమవడంతో భారీ ఎత్తున వేడుకలకు సిద్ధమవుతున్న బీజేపీ శ్రేణులు, ఇప్పటికే జిలేబీలు, మిఠాయిల తయారీతో సంబరాల్లో మునిగిపోయారు. బెంగాల్ రాజకీయాల్లో ఈ మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *