తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ఏకైక నినాదం… “తమిళగ వెట్రి కళగం (TVK)”. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక సునామీలా మారి అధికార డీఎంకే కోటలను బద్దలు కొడుతోంది. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా అణిచివేయాలని చూసినా ‘దళపతి’ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతున్నారు.
తమిళనాడు రాజకీయ యవనికపై ఒక కొత్త చరిత్ర లిఖించబడింది. నిన్నటి వరకు “సినిమా హీరోలే కదా.. మేకప్ తీస్తే ఏముంటుంది?” అని ఎగతాళి చేసిన నోళ్లే ఇప్పుడు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నాయి.
కుట్రల వ్యూహం – విజయ్ ఎదురుదాడి
విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని మొగ్గలోనే తుంచేయాలని ప్రత్యర్థులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. సామాదాన దండోపాయాలన్నీ వాడేశారు:
- వ్యక్తిగత విమర్శల అస్త్రం: విజయ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేయించారు.
- కుటుంబంలో చిచ్చు: ఇంట్లో గొడవలు ఉన్నాయని, తండ్రితో విభేదాలని రకరకాల కథనాలు అల్లి కౌటుంబిక కలహాలు సృష్టించే ప్రయత్నం చేశారు.
- కేసుల ఉచ్చు: అడుగడుగునా లీగల్ నోటీసులు, పాత కేసులను తవ్వి తీయడం ద్వారా ఆయన్ని భయపెట్టాలని చూశారు.
- విలన్ చిత్రికరణ: ప్రజల దృష్టిలో ఆయనో “చెడ్డవాడు” అని ముద్ర వేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దుష్ప్రచారం చేశారు.
- కిడ్నాపులు & వివక్ష: ప్రచారానికి వెళ్తుంటే అడ్డంకులు, కుల వివక్షను తెరపైకి తెచ్చి ఓట్లను చీల్చాలని చూశారు. చివరికి కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ కిడ్నాపుల పర్వానికి కూడా తెరలేపారు.
సూర్యుడు అస్తమించే వేళ..
తమిళనాడులో దశాబ్దాలుగా వెలుగుతున్నామని విర్రవీగిన డీఎంకే “సూర్యుడికి” ఇప్పుడు అస్తమయ కాలం దగ్గరపడింది. ఉచిత హామీలు, వారసత్వ రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టవచ్చని అనుకున్న అధికార పార్టీకి, విజయ్ రూపంలో ఒక పొలిటికల్ సునామీ ఎదురైంది.
“ప్రత్యర్థులు గోతులు తవ్వారు.. విజయ్ వాటిని పునాదులుగా మార్చుకున్నాడు. వారు అడ్డంకులు సృష్టించారు.. విజయ్ వాటిని సోపానాలుగా మార్చుకున్నాడు.”
ఎవరి సపోర్ట్ అక్కర్లేదు.. మేజర్టీయే మా టార్గెట్!
పొత్తుల కోసం పాకులాడటం, సీట్ల కోసం బేరసారాలు ఆడటం విజయ్ డిక్షనరీలోనే లేదు. “సింహం సింగిల్‌గా వస్తుంది” అన్న డైలాగ్‌ను నిజం చేస్తూ, ఏ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా TVK అడుగులు వేస్తోంది.
- యూత్ పవర్: రాష్ట్రంలోని యువత మొత్తం విజయ్ వెంటే ఉంది.
- మహిళా మద్దతు: మార్పు కోరుకుంటున్న మహిళలు డీఎంకే వైఫల్యాలను ఎండగడుతూ విజయ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.
- క్లీన్ ఇమేజ్: ఎన్ని బురద చల్లినా విజయ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకపోవడమే ప్రత్యర్థులకు పెద్ద షాక్.
తమిళనాడులో విజయ్ ముందంజకు కారణాలు..
1) రాష్ట్రంలో ఉన్న కనిపించని భారీ శూన్యత
2) విజయ్ కు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్
3) విజయ్ ను పదేపదే టార్గెట్ చేసి టార్చర్ చేయడం.. ఇది సానుభూతి పెంచింది
4) పాలక డీఎండీకే వైఫల్యాలు.. అన్నాడీఎంకే అనాశక్తత
5) విజయ్ లో ఎంజీఆర్/ జయలలితను చూసుకున్న ప్రజలు
చివరి మాట:
రాజకీయాల్లో వెన్నుపోట్లు, కుతంత్రాలు సహజం. కానీ వాటిని ఎదుర్కొని నిలబడటమే అసలైన నాయకత్వం. ప్రత్యర్థులు ప్రదర్శించిన సామాదాన దండోపాయాలకు విజయ్ తన విజయంతోనే సమాధానం చెప్పాడు. ఇక కోటపై ఎగిరేది TVK జెండానే! డీఎంకే కోట కూలిపోవడం ఖాయం.. విజయ్ జైత్రయాత్ర ఆపడం ఎవరితరం కాదు!












Leave a Reply