కేరళలో యుడిఎఫ్ జోరు

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌లో యుడిఎఫ్ (UDF+) కూటమి ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 140 స్థానాలకు గాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71ని దాటేసి ఏకంగా 80 స్థానాల్లో యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుత అధికార కూటమి ఎల్డిఎఫ్ (LDF+) కేవలం 38 స్థానాలకే పరిమితమై గట్టి ఎదురుదెబ్బ తింది. మరోవైపు బిజెపి (BJP+) కూటమి 10 స్థానాల్లో ముందంజలో ఉండి తన ఉనికిని చాటుకుంటోంది. కేరళ ఓటర్లు ఈసారి మార్పు కోరుకుంటూ యుడిఎఫ్ వైపు మొగ్గు చూపినట్లు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే కేరళలో యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *