తమిళనాడులో ‘విజయ్’ శకం

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్‌లో టీవీకే ఏకంగా 100కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండి సెంచరీ కొట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఈ అనూహ్య పరిణామంతో అధికార డీఎంకే మూడో స్థానానికి పడిపోయింది. స్వయంగా సీఎం స్టాలిన్ సహా 28 మంది మంత్రులు వెనుకంజలో ఉండటం గమనార్హం. ఫలితాల సరళిని చూసి షాక్ తిన్న డీఎంకే కార్యకర్తలు కార్యాలయం వద్ద సంబరాల కోసం వేసిన టెంట్లను పీకేసి, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అక్కడి నుంచి నిష్క్రమించడంతో డీఎంకే ఆఫీసు బోసిపోయింది. మరోవైపు చెన్నైలోని విజయ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు, నేతలు భారీగా తరలిరావడంతో కేంద్ర బలగాలతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడులో ‘విజయ్’ శకం మొదలైనట్లు ఈ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *