తమిళనాడులో విజయ్ టీవీకే 54 స్థానాల్లో ఆధిక్యం

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ గమనిస్తే అక్కడ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార డీఎంకే (DMK) మరియు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా లెక్కల ప్రకారం విజయ్ టీవీకే 54 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, డీఎంకే 45 స్థానాల్లో గట్టి పోటీనిస్తోంది. మరోవైపు అన్నా డీఎంకే మరియు బీజేపీ కూటమి మూడో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ప్రస్తుతం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా ‘హంగ్’ ఏర్పడే దిశగా ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. తమిళనాడు ఓటర్లు వేసిన ఈ ‘ఈల’ ఆ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపేలా ఉంది. మొత్తం మీద అధికార పీఠం కోసం సాగుతున్న ఈ పోరులో విజయ్ పార్టీ సృష్టించిన సంచలనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *